Home Page SliderTelangana

చెన్నూరులో హోరాహోరీ? గెలిచేదెవరు?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రియల్ వార్ చెన్నూరు వేదికగా జరగబోతోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు వీరవిధేయుడిగా ఉన్న బాల్క సుమన్ ఇక్కడ్నుంచి రెండోసారి విజయం సాధించాలని భావిస్తున్నారు. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న సుమన్‌కు ఈసారి పారిశ్రామికవేత్త వివేక్ షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ ను సుమన్ ఓడించారు. తాజగా ఇద్దరు మరోసారి బరిలో దిగడం విశేషం. చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సుమన్ పోటీ చేస్తోండగా, కాంగ్రెస్ నుంచి జి వివేక్, బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలో నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగే అవకాశం ఉంది.

చెన్నూరు ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 227 పోలింగ్ బుత్‌లు ఉండగా.. పురుషు ఓటర్లు 91,969,స్త్రీ ఓటర్లు 92,141 ట్రాన్స్‌జెండర్లు 7 మొత్తం ఓటర్లు 1,84,117 ఉన్నారు. చెన్నూరులో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీసీ జనాభా నియోజకవర్గంలో సగానికిపైగా ఉంది. ఇతర ఎస్సీ, ఎస్టీలు 16 శాతం వరకు ఉండగా, మాదిగలు 10 శాతం ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలీలు, యాదవులు 6 శాతం ఉన్నారు. మున్నూరు కాపులు 6 శాతం వరకు ఉండగా, రెడ్లు 5 శాతం ఉన్నారు. గౌడ సామాజికవర్గం 4 శాతం ఉన్నారు. బీసీలు ఎవరి పక్షం వహిస్తే వారే చెన్నూరులో విజయం సాధిస్తారు. చెన్నూరులో మరోసారి గెలిచేందుకు బాల్క సుమన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఇక్కడ గట్టి పోటీ నెలకొంది. గతంలో ఇక్కడ్నుంచి వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. చెన్నూరులో గతంలో బోడ జానర్దన్ నాలుగు సార్లు, నల్లాల ఓదేలు మూడు సార్లు విజయం సాధించారు. చెన్నూరు నుంచి 1999 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వివేక్ 2004లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 1999, 2009, 2010 ఉపఎన్నికల్లో వివేక్ ఇక్కడ్నుంచి ఓటమిపాలయ్యారు.