“CSK VS GT” రిజర్వ్ డే మ్యాచ్‌లో కప్పు ఎవరిది?
ఈ IPL సీజన్ పోరు ముగింపుకు చేరుకోబోతుంది. కాగా నిన్నే ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుండగా..వర్షం కారణంగా మ్యాచ్ ఈ రోజుకు వాయిదా పడింది. అయితే ఇవాళ్టి మ్యాచ్‌లో ఇప్పటికే IPL లో నాలుగు సార్లు కప్పు సొంతం చేసుకున్న ధోని సేనతో.. గత సంవత్సరం IPL ట్రోఫీని దక్కించుకున్న హార్థిక్ సేన తలపడనుంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ గెలవాలని CSK అభిమానులు కోరుకుంటుంటే..కాదు గుజరాత్ టీమే గెలవాలని GT అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతేడాది ఇదే రోజున (మే 29) GT టీమ్ ఫైనల్లో రాజస్థాన్ టీమ్‌ను ఓడించి IPL టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సెంటిమెంట్ కలిసి వస్తే.. మళ్లీ ఈ ఫైనల్ మ్యాచ్‌లో GT యే గెలుస్తుందని GT అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు CSK సారథి ధోనికి కూడా ఇదే ఫైనల్ IPL మ్యాచ్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ సీజన్‌లో ధోని తప్పకుండా గెలిచి తీరుతారని ఆయన అభిమానులు ధోని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో IPL ట్రోఫీ ఎవరిని వరిస్తుందో చూడాలంటే సాయంత్రం జరగబోయే మ్యాచ్ వరకు వేచిచూడాల్సిందే.


 
							 
							