Home Page SliderNational

స్క్రిప్ట్ రైటర్‌ సత్యానంద్‌కు మెగాస్టార్ ప్రశంసలు

Share with

గత 50 సంవత్సరాలుగా సినీరంగంలో ఉంటూ, అనేక చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన రైటర్ సత్యానంద్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సినీ జీవితం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి ట్విటర్‌లో ఆయనను అభినందిస్తూ, కొన్ని ఫొటోలను షేర్ చేశారు. నంది అవార్డు గ్రహీత, ఎన్నోవిజయవంతమైన చిత్రాలకు స్క్రిప్ట్ సమకూర్చిన డైలాగ్ రైటర్ సత్యానంగ్ గారు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయశుభాకాంక్షలని తెలియజేశారు. తన సినీ ప్రస్థానంలో సత్యానంద్ గొప్ప పాత్ర పోషించారని, నేటి రచయితలకు మెంటార్‌గా, గైడెన్స్ ఇస్తున్నారని సినిమాను ఎంతగానో ప్రేమించే మృదుభాషి, సౌమ్యులు తన స్నేహితుడిగా ఉండడం చాలా  సంతోషమని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఇలాగే సినీ పరిజ్ఞానాన్ని, ప్రేమను అందరికీ పంచుతూ, మరో అర్థ శతాబ్దం పాటు ఇలాగే ఎనర్జీతో ఉండాలంటూ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యానంద్ చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాన్ వంటి నటుల చిత్రాలకు మంచి డైలాగ్‌లు అందించారు. 1974లో దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.