Breaking NewscrimeHome Page SliderTelangana

సెల్లార్ తవ్వుతుండ‌గా మృత్యు ఒడిలోకి…

ఎల్బీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్‌ తవ్వుతుండగా మట్టిదిబ్బలు విరిగి ప‌డ‌టంతో ముగ్గురు కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.వీరంతా మ‌ట్టి దిబ్బ‌ల‌కిందే సజీవ స‌మాధి అయిపోయారు.మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మృతులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు.స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.అతిక‌ష్టం మీద ఒక మృత‌దేహాన్ని మ‌ట్టిదిబ్బ‌ల నుంచి వెలికి తీశారు.మ‌రో ఇద్ద‌రి మృత‌దేహాల‌ను వెలికి తీయాల్సి ఉంది. దీని కోసం నాలుగు ప్ర‌త్యేక జెసిబిల‌ను తెప్పించారు.మున్సిప‌ల్ ,రెవిన్యూ అధికారులు ప్ర‌మాద ప్రాంతానికి చేరుకుని స‌మీక్షిస్తున్నారు.