Home Page SliderInternational

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ముఖ్యమైన చాట్‌ను పిన్ చేసేసుకోండి

వాట్సాప్‌లో రోజురోజుకీ కొత్త ఫీచర్‌లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమైన టాపిక్‌లను పిన్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రూప్ చాట్‌లలో నిండా ఉండే మెసేజ్‌లలో మనకు కావలసిన మెసేజ్‌ను వెదకి పట్టుకోవడం కష్టమే. మొత్తం చాటింగ్‌ను స్క్రోల్ చేసుకుంటూ వెళ్లలేము. అలాగే ముఖ్యమైన అప్‌డేట్‌లను, సంభాషణలను మిస్ అయిపోతూ ఉంటాము. ఇకపై ఇలా జరగకుండా, మన మీటింగులు, మెసేజ్‌లు, ఫొటోస్ ఏవైనా సరే మిస్ అవకుండా పిన్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇలా పిన్ చేసిన మెసేజ్‌లు చాట్ పై భాగంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని 7 రోజులు, నెలరోజులు, 30 రోజులకు కూడా ఉండేలా సెట్ చేసుకోవచ్చు. దీనిని ఎలా పిన్ చేయాలంటే మనం కావాలనుకున్న మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. అప్పుడు మోర్ ఆప్షన్స్ అనే మెసేజ్‌లు కనిపిస్తాయి. వీటిలో పిన్(PIN)అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని పిన్ చేయవచ్చు. అక్కరలేదనుకున్నప్పుడు అన్ పిన్ కూడా చేయవచ్చు.