NewsNews AlertTelangana

మార్చాల్సింది చట్టం కాదు.. ప్రభుత్వాన్ని..

గోవుల ఆధారంగా సేంద్రియ వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రైతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. తన 150 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానన్నారు. తన వద్ద 21 ఆవులు ఉన్నాయని తెలిపారు. గో సంబంధిత వస్తువులతో వ్యవసాయం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయనడానికి తాను నిదర్శనమని అమిత్ షా వివరించినట్లు రైతులు తెలిపారు. విద్యుత్ చట్టాన్ని మార్చాలన తమ సూచనలు కేంద్ర హోం మంత్రి పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని సూచించారని రైతులు పేర్కొన్నారు. ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.

సేంద్రియ వ్యవసాయంపైనే చర్చ: బండి సంజయ్

రైతులు విద్యుత్ చట్టాలపై హోం మంత్రి తో మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది టిఆర్ఎస్ దుష్ప్రచారమే అని విమర్శించారు. అమిత్ షా తో సేంద్రియ వ్యవసాయంపైనే చర్చ జరిగిందని వివరించారు.