Andhra PradeshHome Page Slider

జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే.. నాలుగేళ్లలో పాలనతో నిరూపితం

రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. అర్హతే ప్రామాణికం అన్న సీఎం జగన్ మాటలను నాలుగేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేయని.. గాంధీ కలలుగన్న స్థానిక పాలనను సచివాలయ వ్యవస్థ రూపంలో తెచ్చి ప్రభుత్వం సర్వీసులను ప్రజల గడప వద్దకు చేర్చి చరిత్ర సృష్టించారన్నారు. సంక్షేమం పథకాలతో సహా ప్రభుత్వంతో ఏ పని అయినా అర్హత ఉన్న ఎవరైనా రైట్ రాయల్ గా వెళ్లి తమ పని చేయమని కోరవచ్చని సీఎం జగన్ నిరూపించారన్నారు. ఇదే మా ప్రభుత్వం కాదు. మన ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. ప్రజలందరి ప్రభుత్వం.. సీఎం జగన్ నినాదమని వైసీపీ నాయకుల కొనియాడారు.