డెంగ్యూకి మంచి ఔషధం ఏంటంటే..?
ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..? ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి ఆకు రసం: బొప్పాయి ఆకు రసం ప్లేట్ లెట్ కౌంట్ ను గణనీయంగా పెంచుతుందని.. అలసట, బలహీనత వంటి డెంగ్యూ లక్షణాలను తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
దానిమ్మ జ్యూస్: ఇనుము అధికంగా ఉండే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లేట్ లెట్ కౌంట్ ను మెరుగుపరచడమే కాకుండా, డెంగ్యూ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
గుమ్మడికాయ రసం: గుమ్మడికాయ ‘విటమిన్ ఎ’కు అద్భుతమైన మూలం. కాగా ఇది ప్లేట్ లెట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. డెంగ్యూ రికవరీ సమయంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ప్లేట్ లెట్ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకునేందుకు హెల్ప్ చేస్తుంది.

