Home Page SliderTelangana

ప్రజల ముఖం చూడకుంటే ఎట్ల సారు..?

‘గడిచిన పదేళ్లలో సీఎంగా పని చేసినన్ని రోజులు సెక్రటేరియట్ కు రాకపోతివి, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతివి.. నిన్ను గెలిపించుకున్న గజ్వేల్ ప్రజల ముఖం చూడ కపోతే ఎట్ల కేసీఆర్ సారూ’ అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్ కారణంగా గజ్వేల్ లో పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం అందకుండా పోతుందని కేసీఆర్ పై మంత్రి ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు మంత్రి హాజరై మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాగితాలపై ఎమ్మెల్యే కేసీఆర్ సంతకం చేస్తే తప్ప లబ్ధిదారులకు చెక్కులు అందవన్నారు. బీఆర్ఎస్ చెడగొట్టిన తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి బాగు చేస్తున్నారన్నారు. కానీ బీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రాక్షసానందం పొందుతున్నారని, దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని మంత్రి సూచించారు.