8 ఎంపీలనిచ్చిన తెలంగాణకు ఏమిచ్చారు?
కేంద్రబడ్జెట్ 2024-25లో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపించిందని తెలంగాణ మండిపడుతోంది. 8 మంది ఎంపీలనిచ్చిన తెలంగాణకు ఏమిచ్చారని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీని పార్లమెంట్ ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించినా లాభం లేకపోయిందని, పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. ఈ బడ్జెట్‌లో ఎన్డీయే కూటమి రాష్ట్రాలైన ఏపీ, బీహార్‌లకు పెద్దపీట వేశారని, అస్సాంకు కూడా ప్రాధాన్యత కనిపించింది. రైలు మార్గాలు లేని తెలంగాణ జిల్లాలలో కొత్త ట్రాకులు వస్తాయని ఆశకు మరోసారి దెబ్బ పడింది. ఈ సారి బడ్జెట్‌లో తెలంగాణకు అసలు నిధులు ఇచ్చే ఊసే లేదని ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

