మసీదులో నమాజ్‌కు వచ్చిన యువకులు ఏం చేశారంటే..
హైదరాబాద్‌లోని నాంపల్లిలో దర్గా యూసిఫిన్‌కు నమాజ్ కోసం వచ్చిన హుస్సేన్, రియాన్ అనే ఇద్దరు యువకులు విచక్షణ లేకుండా ప్రవర్తించారు. వారు గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి పరస్పరం ఘర్షణ పడ్డారు. హుస్సేన్ తన దగ్గరున్న కత్తితో రియాన్‌పై దాడి చేశాడు. సమాచారం తెలిసిన పోలీసులు రియాన్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్యా గతంలో గొడవలు ఉన్నాయని, మత్తు పదార్థాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ గంజాయితో ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యతును నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.