crimeHome Page SliderInternationalviral

డిస్నీలాండ్‌కు కుమారుడిని తీసుకెళ్లిన మహిళ ఏం చేసిందంటే..

విడాకులు తీసుకున్న భార్య, తన కుమారుడిని భర్తకు అప్పగించడం ఇష్టం లేక దారుణం చేసింది. కాలిఫోర్నియాలోని భారత సంతతికి చెందిన సరితా రామరాజు(48) అనే మహిళ తన 11 ఏళ్ల కుమారుడిని హతమార్చింది. వారు విడాకులు తీసుకున్నప్పుడు కుమారుడి బాధ్యతలను కోర్టు భర్తకు అప్పగించింది. అప్పుడప్పుడు తల్లికి కలిసే అవకాశం కల్పించింది. వర్జీనియాలో ఉంటున్న ఆమె ఇటీవల తన కుమారుడి కోసం కాలిఫోర్నియా వచ్చింది. శాంటా అనాలో ఒక హోటల్ రూమ్ తీసుకుని, డిస్నీల్యాండ్ టిక్కెట్లు సైతం కొనుగోలు చేసింది. మార్చి 19న తన బిడ్డను భర్తకు అప్పగించాల్సి ఉండగా, ఆమెకు ఇష్టం లేక బిడ్డను హత్య చేసింది. ఉదయం పోలీసులకు ఫోన్ చేసి, కుమారుడిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపింది. పోలీసులు అక్కడికి చేరేటప్పటికే బాలుడు మృతి చెందాడు. అయితే కొన్ని గంటల ముందే బాలుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.