NationalNews

ఉద్ధవ్ మహాపతనం వెనుక అసలేం జరిగింది?

Share with

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని అసెంబ్లీలో బలపరీక్ష జరిపించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించడంతో మహా పరిణామాలు మారిపోయాయ్. సుప్రీం తీర్పుతో మహావికాస్ అగాడి ప్రభుత్వ పతనం దాదాపు ఖాయమైపోయింది. సభలో బల నిరూపణ చేసుకోవాల్సిందేనంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఉద్ధవ్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు ఉద్ధవ్. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫాలో కావాల్సిందేనన్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి రాజీనామా సమర్పించారు. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్ధవ్ వర్గంలో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. విశ్వాస పరీక్ష సమయంలో పరిణామాలను అనుసరించి జులై 11న తీర్పిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. శివసేన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని… పార్టీలోని 39 మంది ఎమ్మెల్యేలు ఎక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు ప్రకటించారని కోర్టుకు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మించి ఎమ్మెల్యేలు తిరుగుబాటు వర్గంలో ఉండటంతో సంకీర్ణ సర్కారు కుప్పుకూలింది.

ఎక్‌నాథ్ సింగ్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఫడ్నవీస్, ఎక్‌నాథ్ షిండే కోరనున్నారు. తొమ్మిది రోజుల క్రితం మొదలైన మహా సంక్షోభం ఉద్ధవ్ రాజీనామాతో సమసిపోయింది. మొదట సూరత్ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ్నుంచి గౌహతికి చేరుకోవడ.. అక్కడ్నుంచి గోవా రావడం అంతా పథకం ప్రకారం జరిగిపోయాయ్. ఎక్ నాథ్ తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ కు అసెంబ్లీలో బలనిరూపణ కష్టంగా మారనుంది. తగిన సంఖ్యా బలం లేనందున ఉద్ధవ్ పదవికి రాజీనామా చేశారు. సిద్ధాంత వైరుధ్యాలున్న కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన పొత్తు పెట్టుకోవడం వల్లే తాము ఉద్ధవ్ పై తిరుగుబాటు చేశామంటూ ఎక్ నాథ్ ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉద్ధవ్ థాక్రే ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో లేడన్న విమర్శలను తిరుగుబాటు నేతలు బలంగా విన్పించారు. తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ థాక్రే సీఎం నివాస వర్ష నుంచి సొంత నివాసం మాతోశ్రీకి మారారు. పదవికి రాజీనామా చేస్తానంటూ నిర్ణయించిన శరద్ పవార్ వద్దనడంతో వెనక్కి తగ్గారు.