టీడీపీ-జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం: పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్రయం గురువారం మధ్యాహ్నం 12-15 గంటలకు సెంట్రల్ జైలులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. జైలు నిబంధనల ప్రకారం గరిష్ఠంగా ముగ్గురికి ములాకత్ ఇవ్వవచ్చు కాబట్టి ముగ్గురూ ఒకేసారి బాబు వద్దకు వెళ్లారు. మోడీ పిలిస్తేనే వెళ్లాను తప్పించి… నేను సొంతంగా వెళ్లలేదని పవన్ చెప్పారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లనన్నారు పవన్ కల్యాణ్. విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు అనుభవం కావాలనే మద్దతిచ్చానన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికే వచ్చానన్నారు. చంద్రబాబును రిమాండ్‌లో ఉంచడం బాధాకరమన్నారు.


