“కేసీఆర్ ఆ పని చేయకుంటే మోదీ ముందు మోకరిల్లినట్లు భావిస్తాం”:సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణాకు మొండిచెయ్యి చూపించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షనేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.కాగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. రాష్ట్ర హక్కులు,నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న చర్చ సభలో జరగనుందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర హక్కులు సాధించుకోవడంలో కలిసిరావాలన్నారు. ఈ మేరకు కేసీఆర్ సభకు వస్తే ఆయన రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడినట్లు అని సీఎం పేర్కొన్నారు. లేదంటే ఆయన మోదీ ముందు మోకరిల్లినట్లు భావిస్తామని సీఎం స్పష్టం చేశారు. కాగా మౌనమే బానిసత్వానికి పర్యాయపదం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

