Breaking Newshome page sliderHome Page SliderTelangana

టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో టెక్నాలజీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్న AWS డేటా సెంటర్ ప్రాజెక్టులు, విస్తరణ అవకాశాలు, మౌలిక సదుపాయాల అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, టెక్నాలజీ రంగంలో తెలంగాణను దేశంలోనే ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో AWS గ్లోబల్ డేటా సెంటర్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.