NationalNews

కొత్త పార్లమెంట్ భవనంపై కొత్త రచ్చ…

Share with

కొత్త పార్లమెంట్ భవనంపై ప్రధాని ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది.కొత్త చిహ్నంపై విపక్షలు,సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వక్తం చేస్తున్నారు.హుందగా,రాజసంగా,ఆత్మవిశ్వాసంతో ఉండే నాలుగు సింహలు..క్రూరంగా,గర్జిస్తున్నట్లుగా దూకుడు స్వభావంతో కనిపిస్తున్నాయని…తక్షణమే ఆ సింహలను మార్చలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఆ జాతీయ చిహ్నంపై అభ్యంతరం తెలుపుతూ పలు పార్టీల నేతలు ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై శిల్పి సునిల్ దియోదర్ స్పందిస్తూ తనను ఎవరూ ప్రభావితం చేయలేరని కొత్త చిహ్నం ఎర్పాటు చేసేందుకు సారనాధ్‌లో గల చిహ్నన్ని పరిశీలించి చిహ్నం సేమ్ వచ్చేలా కృషి చేశామని తెలిపారు.సారనాధ్ గల చిహ్నం ఎత్తు 3.5 ఫీట్లు ఉందని…..కాని పార్లమెంట్ వద్ద ఏర్పాటు చేసిన చిహ్నం 21.3 ఫీట్ల ఎత్తు ఉందని అయితే సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలు కింది నుంచి తీశారని అందుకే వ్యక్తీకరణలో తేడా కనిపించిందని వివరించారు.

ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయి:బీజేపీ

విపక్షాల విమర్శలను బీజేపీ ఖండించింది. 150 ఎండ్ల క్రితం నిర్మించిన భవనానికి బదులుగా కొత్త పార్లంమెంట్ భవనాన్ని నిర్మిస్తూంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడింది. పార్లమెంట్ నూతన భవనంపై ఆవిష్కరించిన నాలుగు సింహల ప్రతిమ సారనాథ్ స్తంభంపైనున్న సింహలకు ప్రతిరూపమేనని బీజేపీ పేర్కొంది. సారనాథ్ స్తూపం, ప్రస్తుత నిర్మాణం కొలతల్లో చాల తేడా ఉందని …అందుకే సింహల రూపురేఖలు మారినట్లు కొందరికి అనిపిస్తుండొచ్చని ఒక వేళ సారనాథ్ చిహ్నం పరిమాణాన్ని పెంచినా, పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసినా చిహ్నన్ని దాని స్ధాయికి తగ్గించిన రెండింటిలో తేడా ఏమీ ఉండదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరదీప్‌సింగ్ పురి తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం 13 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.ఈ భవనం మధ్యలో పైకప్పు మీదనాలుగు సింహల చిహ్నన్ని ప్రతిష్టించారు.ఇది కాంస్య విగ్రహం దీని బరువు 9,500 కిలోలు. ఎత్తు ఆరున్నర మీటర్లు,6500 కీలోగ్రాముల బరువైన ఉక్క నిర్మాణంపై
ఏర్పటు చేశారు.

Read More: సింహాలపైనా సిల్లీ రాజకీయాలు