మాల్దీవులకు శ్రీలంక అధ్యక్షుడు
అధ్యక్షుడు పారిపోయాడు… దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు… శ్రీలంక ఆగమాగమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచిపారిపోవడంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయ్. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ దాపురించింది. బుధవారం అధ్యక్షబాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ గొటబయ ప్రకటించడంతో… అక్కడ గందరగోళం నెలకొంది. దేశంలో అల్లకల్లోలానికి కారణం గొటబయనేనంటూ జనం ఆయన అధ్యక్షభవనాన్ని సైతం ఆక్రమించి… ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. ప్రధాని రణేల్ విక్రసింహ… తాత్కాలిక అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకురావాలంటే అత్యవసర పరిస్థితే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. కొలంబోతో సహా, పశ్చిమ శ్రీలంక మొత్తం ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. గొటబయ మాల్దీవులకు పారిపోయాడన్న వార్తలతో… ఆయన తక్షణం వైదొలగాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని విక్రసింఘే నివాసం వద్ద ఆందోళనలు ఉధృతమవుతున్నాయ్.