సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లు అంతా అబద్దం
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకో (నీకింత నాకింత) కు పాల్పడ్డారని పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు.అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్మాతలు,హీరోలు పంచుకున్నారని వాటిని తక్షణమే ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేయాలని పిటీషనర్ పేర్కొన్నాడు.ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించి అడ్డదారిలో బదిలీ అయిన ఆదాయాన్నంతా ప్రభుత్వ ఖాజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.దీంతో హైకోర్టు ఈ కేసుని విచారణకు తీసుకుంది.

