హుస్సేన్ సాగర్‌లో డేంజర్ లెవల్‌కు వాటర్
ఓవైపు రుతుపవనాలు.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయ్. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. వరద నీరు రోడ్లపైకి రావడంతో సామాన్యులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయ్. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవకున్నా… నిత్యం సగటున 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. నాన్చుడువానతో… నగరంలోని నాలాలన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు భారీగా రావడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. హుస్సేన్ సాగర్ నిండిపోవడంతో జనం లబోదిబోమంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం వుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశఆరు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.41 మీటర్లకు చేరుకోవడంతో… అధికారులు తలలుపట్టుకుంటున్నారు. GHMC పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Read More: పునఃప్రారంభమైన అమర్‌నాధ్ యాత్ర