NewsTelangana

తెలంగాణా ఎంసెట్ వాయిదా పడే అవకాశం

Share with

గత వారంరోజులుగా తెలంగాణాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్దలకు మూడురోజులు సెలవులు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్రవిద్యామండలి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 14,15 తేదీలలో అగ్రికల్చర్ మరియు 18,19,20 తేదీలలో ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరగవలసి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎంసెట్ పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. విద్యార్దులు సొంత ఊర్ల నుండి జిల్లాకేంద్రాలకు రాలేని పరిస్ధితి ఏర్పడింది.  వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్  ఏర్పాట్లు మొదలు కాలేదు.  14,15 తేదీలలో అగ్రికల్చర్ పరీక్షలను 16,17 తేదీలలో జరిపే అవకాశాలను పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎంసెట్ కేంద్రాలు కూడా నీట మునిగాయి.  ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే  విద్యార్థులకు కష్టంగా మారుతోంది. దీంతో ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.  భారీ వర్షాలతో గత మూడు రోజులుగా తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీల్లో పరీక్షలు కూడా రద్దయ్యాయి. జిల్లాల నుండి పూర్తి సమాచారం తెప్పించుకొని, పరిశీలించాకే ఎంసెట్ ను వాయిదా వేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవచ్చు.