‘ ప్రియాంక త్రివర్ణ ప్రసంగం చూడండి, ఇదే మా వారసత్వం’- రాహుల్ ఇన్‌స్టాగ్రామ్
రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎంపీగా అనర్హతకు గురైనందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన సోదరి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక గాంధీ వాద్రా ఇచ్చిన ప్రసంగాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ప్రసంగంలో ప్రియాంక, బీజేపీపై నిప్పులు చెరిగారు. తన తండ్రి రాజీవ్ గాంధీ అంత్యక్రియలను గుర్తు చేశారు. ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అని, ఆయన మరణించినప్పుడు త్రివర్ణ పతాకాన్ని శరీరంపై కప్పి అంత్యక్రియలు జరిపించారని తెలుసుకోమన్నారు. అటువంటి దేశభక్తుని కుమారుడిని దేశద్రోహిగా అభివర్ణించిన కేంద్రప్రభుత్వం తమ కుటుంబాన్నే కాక, కాశ్మీర్ పండిట్ల జాతినే అవమానపరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మీకు ఎలాంటి శిక్షా ఉండదా ?మీకు ఎన్నేళ్లు అనర్హత వేటు వేయాలి? అంటూ ప్రశ్నించారు.

