నల్గొండ జిల్లాలో VRA ఆత్మహత్య
నల్గొండ జిల్లాలో VRA వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న VRAల నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తన సహచర ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. VRA వెంకటేశ్వర్లు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా వారు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయకుంటే ఉద్యోగులంతా సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

