ఆదిపురుష్ టీజర్‌పై విష్ణు క్లారీటీ
ఆదిపురుష్ టీజర్ విషయం లో తనపై వస్తున్న వార్తల్లో ఏలాంటి నిజం లేదని నటుడు మంచు విష్ణు చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని విష్ణు ఓ ట్వీట్ చేశారు. “ఫేక్ న్యూస్” నేను ఊహించిన విధంగానే జిన్నా రిలిజ్‌కు ముందు కొంతమంది కావాలనే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. నా డార్లింగ్ ప్రభాస్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించి నాకేమి వద్దంటూ రాసుకొచ్చారు. అయితే ఆదిపురుష్ భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులను ఆలరించబోతోంది. తాజాగా వచ్చిన ఈ సినిమా టీజర్‌కు సిని ప్రియుల నుండి వచ్చిన విమర్శల విషయం తెలిసిందే. కాగా జిన్నా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు ఆదిపురుష్ టీజర్‌పై స్పందించినట్లు కథనాలు రావడమే కాకుండా..సోషల్ మీడియాలో పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. సినిమా గురించి తాను ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్టు , కానీ టీజర్ మాత్రం యానిమేటెడ్ మూవీలా ఉందని… ఓ ప్రేక్షకుడిగా తాను మోసపోయినట్టు ఆ పోస్టులు ఉండడంతో దీనిపై విష్ణు స్పందించారు.