ఈడీ ఎదుట విజయ్ దేవరకొండ
పాన్ ఇండియా యాక్టర్ విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్ లావాదేవీల విషయంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈడీ విచారణకు ఆ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి హాజరయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు. లైగర్ సినిమా నిర్మాణానికి నిధుల వ్యవహారంలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేతకు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందని భావిస్తున్నారు. దీంతో లైగర్ సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

