“సమస్యాత్మక ప్రాంతాలపై అప్రమత్తత అవసరం”.. సీఎం
మంగళవారం జరగబోయే గణేష నిమజ్జనాలలో సమస్యాత్మక ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు వివరించారు సీపీ. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.

