బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేపట్టారు. అధికారంలోకి రావటం కోసం కార్యాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. కార్యాలయం లోపలకు వెళ్లే ప్రధాన గేటును గత కొంత కాలంగా మూసివేసి ఉంచారు. లోపలకు రావటానికి ప్రత్యామ్నాయంగా.. ఐరన్ మెట్లు ఏర్పాటు చేసి సైడ్ డోర్‌ను బీజేపీ నేతలు ఉపయోగిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం మూసివేసిన ప్రధాన గేటును పూర్తిగా తొలగించి… కొత్త మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన ఛాంబర్‌లో వాస్తు మార్పులు చేశారు.

