నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచాడు… జగన్ సర్కారుపై వాల్మీకిల మండిపాటు
ఆoధ్రప్రదేశ్ మైదాన ప్రాంత వాల్మీకి బోయలు వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో వాల్మీకి బోయలు సుమారు 50 లక్షల మంది ఉన్నారని.. వారంతా రిజర్వేషన్ల విషయంలో తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారని ఒకే రాష్ట్రంలో ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అంటూ ఏ గిరిజన జాతికి లేనటువంటి రిజర్వేషన్ల పద్దతిని కేవలం వాల్మీకి బోయల పట్ల ఎoదుకని ఇది రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదని దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వాల్మీకిలను బోయలుగా, గిరిజనలుగాను మరికొన్ని జిల్లాల వాల్మీకి బోయలను వెనుకబడిన తరగతుల గాను వేరు వేరు రిజర్వేషన్ల పద్దతులు అమలు చేయడం వలన విద్యా, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోతున్నారని విమర్శించారు ఆలిండియా వాల్మీకి సమాజ్ ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాస రావు.

రిజర్వేషన్ల వివక్ష తొలగిస్తామని గతంలో అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రాజకీయ నాయకులు వాల్మీకి బోయలకు అనేక మార్లు హామీలు ఇచ్చారని… అధికారంలోకి వచ్చాక మాట తప్పి వాల్మీకి బోయలను మోసం చేయడం పరిపాటిగా మారిపోయిందని వీరిపట్ల వివక్ష నిరంతరాయంగా కొనసాగుతుoదని వాల్మీకీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి బోయల వృత్తి వేట అని అడవి చట్టాల పేరుతో వేటకు కూడా వెళ్లకుండా నిషేధం విధించి వాల్మీకి బోయలను అడవవుల నుoచి బలవంతంగా నెట్టి వేశారని ఆక్షేపిస్తున్నారు. రాజ్యాంగ పరంగా ఏదైన జాతి వారు వారి వృత్తిని కొనసాగిoచుకోవచ్చని చెబుతూనే మరోపక్క అడవి చట్టాల పేరుతో ఈ పాలకులు.. మూలాలను, బతుకు తెరువును సమస్యల వలయంగా మార్చడమే కాకుండా చివరికి ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.

గతంలో అనేక మంది పాలకులు వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామని చెప్పి వారికి ఎటువంటి న్యాయం చేయకుoడా మోసం చేసారని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సైతం ఆ లిస్టులో చేరారంటూ వాల్మీకీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రాoతీయ వ్యత్యాసాలు తొలగించి వాల్మీకి బోయలను మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గిరిజన జాతులుగా మార్చి కేంద్ర ప్రభుత్వానికి పంపుతానంటే… వాల్మీకి బోయలు నమ్మి గంపగుత్తగా గెలిపించారని… ఇప్పుడిలా చేయడం భావ్యం కాదని వాల్మీకి నేతలు అంటున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే ముఖ్యమంత్రి జగన్ వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల విషయంలో మాట తప్పారని… మడమ తిప్పారని వాల్మికీ నేతలు విరుచుకుపడుతున్నారు. తీరు మార్చుకోకుంటే… రాబోయే ఎన్నికల్లో వాల్మీకి బోయలు.. జగన్ సర్కారు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.

