ట్రంప్‌కు యూఎస్ కోర్టు భారీ షాక్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పలు దేశాలపై ట్రంప్ విధించిన ట్యాక్స్‌ల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అధ్యక్షునికి ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని మాన్‌హట్టన్ కోర్టు తేల్చి చెప్పింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమలు కాకుండా స్టే విధించింది. అత్యవసర పరిసస్థితులలో మాత్రమే అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షునికి ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చని, రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని మందలించింది. అంతర్జాతీయ వాణిజ్యంపై నిర్ణయం తీసుకోవాలంటే కేవలం కాంగ్రెస్‌కే అధికారం ఉందని, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

