హోలీ వేడుకల్లో మెరిసిన అమెరికా వాణిజ్య మంత్రి రైమోండో
రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్‌తో కలిసి హోలీ సంబరాలు
ముఖానికి రంగులు అద్దుకున్న అమెరికా మంత్రి
కేంద్ర మంత్రులతో హోలీ ఉత్సవాల్లో అమెరికా కీలక మంత్రి
ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్‌లతో కలిసి అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖానికి రంగులు అద్ది, హోలీ వేషధారణకు ఒక దండను జోడించడంతో, US వాణిజ్య మంత్రి గినా రైమోండో డ్రమ్ బీట్‌లకు సరిపోయే స్టెప్స్ వేస్తూ కనువిందు చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. నెమలి ఈకలతో అలంకరించిన కళాకారుడు అక్కడ గుమిగూడిన ప్రేక్షకులను అలరించారు. ఇండియా-అమెరికా కమర్షియల్ డైలాగ్, సీఈవో CEO ఫోరమ్‌లో పాల్గొనేందుకు అమెరికా వాణిజ్య మంత్రి రైమోండో మార్చి 7-10 మధ్య భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఇండియా- అమెరికా మధ్య కొత్త వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు ఆమె ఇండియా పర్యటనకు వచ్చారు. యుఎస్-ఇండియా సీఈఓ ఫోరమ్‌ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్‌లో ప్రారంభించారని యుఎస్ వాణిజ్య విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.


