అకాల వర్షంతో రైతుల గుండెల్లో గుబులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఉక్కిరి బిక్కిరౌతున్నారు. మిగ్‌జాం తుపాన్ తాకిడికి పంటలకు నష్టం కలిగింది. ఈదురుగాలులతో జనం వణికిపోతున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం సైతం కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పొలంలో నేలవాలిన వరిపైరు, నీటిలో వరిపనలు నానుతున్నాయి. పత్తి, మిరప పంటలపైనా ప్రభావం చూపుతోంది. అశ్వారావుపేటలో వర్షబీభత్సం తీవ్రంగా ఉంది. వానల కారణంగా సత్తుపల్లిలోని ఉపరితల గనుల్లో బొగ్గు తవ్వుకోలేక పని నిలిచిపోయింది.


 
							 
							