గ్రూప్-1 అంశంపై TGPSC ఛైర్మన్‌కు కేంద్రమంత్రి లేఖ
గ్రూప్-1 వ్యవహారంపై వారం రోజుల్లో సమగ్ర సమాచారం అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీని కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 అభ్యర్థుల సందేహాలను లేఖలో ప్రస్తావించారు. గ్రూప్-1లో అవినీతి, అక్రమాలు, తప్పిదాలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేశారు. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రమంత్రి.. టీజీపీఎస్సీకి లేఖ రాశారు.


