అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
తెలంగాణ ఆడబిడ్డలందరూ ఉత్సాహంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ పండగ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అతివలందరూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తంగేడు, గునుగు, బంతి పూలతో నేడు నాలుగు వరుసలలో బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు. నేడు నైవేద్యంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలను అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలందరూ బతుకమ్మ చూట్టూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాలు పంచుకుంటారు.