మోడీజీ 19 ఏళ్లుగా మౌనంగా ఉన్నారు: అమిత్ షా
2002 గుజరాత్ అల్లర్ల వ్యవహారంపై తప్పుడు ఆరోపణలు గుప్పించినా… ప్రధాని నరేంద్ర మోదీ 19 ఏళ్లపాటు మౌనంగా భరించారన్నారు హోం మంత్రి అమిత్ షా. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున ఆయన ఆ వ్యవహారంపై స్పందించలేదన్నారు. నాటి కేసుల్లో సీఎం పాత్ర ఏమీ లేదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ANI ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీజీ 19 ఏళ్లు మౌనంగా తప్పుడు ఆరోపణలను భరించారు, ఎవరూ కూడా ఈ విషయమై ధర్నా చేయలేదన్నారు.
మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై కాంగ్రెస్ నిరసనలు చేయడాన్ని ఈ సందర్భంగా షా తప్పుబట్టారు.