NationalNews

ఎమర్జెన్సీకి 47 ఏళ్లు…. దుష్ట కాంగ్రెస్ కోరలు

Share with

ఎమర్జెన్సీ అంటే ఏమిటి ? ఎందుకు విధించారు ? స్వాతంత్ర వచ్చినప్పటి నుంచి ఏలిన పార్టీని దేశంలో భూస్థాపితం చేసిన పార్టీ ఏది? మన జాతీయ నాయకులు పోరాడిన స్ఫూర్తి ఎటువంటిది నేటి యువత తెలుసుకోవాలి..

అసలు ఎమర్జెన్సీ అంటే ఏమిటి ? ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు ఎందుకు? అసలు వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి.

రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 352 నిబంధన రూపొందించినారు. ఆ నిబంధన నిరంకుశత్వం గల పాలకుల చేతిలో వెళ్లి ప్రజాస్వామ్యన్నీ ఖుని చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఆ నిబంధన ఏమంటే “యుద్ధం వల్ల గానీ, లేక విదేశీ దురాక్రమణ వల్ల గాని, లేక సైనిక తిరుగుబాటు వల్ల గాని, భారత దేశ భద్రతకు గానీ, భారత దేశంలో ఏదైనా ప్రాంత భద్రతకు గానీ ప్రమాదము ఏర్పడినట్లయితే… దేశం మొత్తంలో గానీ ఏదైనా ప్రాంతంలో గాని అత్యవసర పరిస్థితి.. ఎమెర్జెన్సీ ఏర్పడినట్టు రాష్ట్రపతి ప్రకటించవచ్చు. అత్యవసర పరిస్థితి అంటే సాధారణ పరిస్థితికి భిన్నమైన అసాధారణ స్థితి. 1962లో ఇండియా చైనా యుద్ధం వల్ల దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేశారు. 1971లో పాకిస్థాన్ ఇండియా యుద్ధంతో దేశంలో 1971 నుండి 1977 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగింది. అయితే 1975లో జూన్ 25 వ తేదీ నాడు దేశంలో “అంతర్గత కల్లోలం” పేరిట ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించారు. ఒకసారి ఎమర్జెన్సీ విధించిన తరువాత అది కొనసాగుతుడగా మరో అత్యవసర పరిస్థితి విధించడానికి ఆర్టికల్ 351 నిబంధన ప్రకారం చెల్లదు కానీ ఆనాటి రాష్ట్రపతి ఇందిరా గాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు .

ఎమర్జెన్సీ విధించడానికి కారణం

1972 మధ్యకాలంలో కాంగ్రెస్ నిరంకుశత్వం, పక్షపాతం, బంధుప్రీతికి అప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా బలమైన వ్యతిరేక పవనాలు విస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులను తలకిందులు చేస్తూ గుజరాత్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఒడిపోవడం, అదే రోజు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎన్నిక కావడం చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించడంతో సిచ్యువేషన్ మారిపోయింది. అంతేగాక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇందిర గాంధీ ఆరేళ్లు దేశంలో ఎక్కడా పోటీ చేయకూడంటూ తీర్పు వచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వినశానమయ్యే సమయం వచ్చినప్పుడు మెదడు సరిగ్గా ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఇదే సూత్రం ఇందిరా గాంధీ విషయంలో రుజవయ్యింది. దేశ ప్రజలు నిద్రిస్తున్న వేళ 1975 జూన్‌ 25 నాడు లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ లాంటి అగ్రశ్రేణి నాయకులను రాత్రికి రాత్రే జైళ్లలో నిర్బంధించారు. ప్రజాస్వామ్య సంస్థలు అన్నింటా మీద నిషేధం విధించి, కార్యాలయాలను సీజ్‌ చేశారు. వార్తా పత్రికల కార్యాలయాలకు కరెంట్‌ కోత విధించి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా సెన్సార్‌ కత్తి ఝుళిపించారు. ప్రజలకు ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపే మొత్తం దేశాన్ని బందీఖానాగా మార్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఏ స్వాతంత్ర్య కోసం… ఏ స్వేచ్ఛ కోసం మన నాయకుల త్యాగం చేశారో దానికి విలువ లేకుండా చేశారు. అత్యవసర పరిస్థితి విధించాలి అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకోవాలి. కానీ D .R .మంకేకర్ రాసిన పుస్తకం “డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ఇందిరాగాంధీ ” లో ఒక చోట ప్రస్తావిస్తూ ఆనాటి హోంమంత్రి బ్రహ్మానందరెడ్డికి కూడా ఈ విషయం తెలీదు అని రాసారు అంటే సొంత కేబినెట్‌ను కూడా సంప్రదించలేని దౌర్భాగ్యం. అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఇందిరా గాంధీ వికృత రూపం జడలు విప్పింది.

అసలు ఎమర్జెన్సీలో ప్రజలకు వచ్చిన నష్టం ఏమిటి ?

స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి మన జీవితాలకు ఒక దారి చూపే దీప స్తంభాలు వంటివి. అలాంటి స్వేచ్ఛ ను కాలరాస్తూ 18 నెలల పాటు నిరంకుశత్వం స్వైరవిహారం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని సుప్రీం కోర్టులో వాదించారు. ఆనాటి అమానుషమైన స్థితికి ఒక ఉదాహరణ కేరళ విద్యార్థి నాయకుడు రాజన్‌ను పోలీసులే అపహరించటం. ఆ అపహరణ కేసులో ప్రభుత్వం పక్షాన వాదించిన అటార్నీ జనరల్‌ ‘అపహరించడమేకాదు, ఒక పౌరుణ్ని చంపినప్పటికీ ప్రశ్నించే అధికారం ఏ కోర్టుకు కూడా లేదని వాదించాడంటే ఆనాటి కిరాతక స్థితి ఎలా ఉందో ఊహించొచ్చు. నేడు స్వేచ్ఛ ,హక్కులు హరించిపోయాయీ అని గగ్గోలు పెట్టె భారత కమ్యూనిస్టు పార్టీ… సీపీఐ సిగ్గు లేకుండా ఎమర్జెన్సీని సమర్థించింది. విప్లవ కవిత్వంలో అగ్రగణ్యులు ఇందిర నియంతృత్వాన్ని స్వాగతించి ఇందిర చేతిలో కీలుబొమ్మలయ్యారు. తర్వాత కాలంలో తప్పు చేశామని చెంపలేసుకున్నా… తప్పు.. ఒప్పు కాదు కదా..

దేశ వ్యాప్తంగా సత్యాగ్రహలు, నిరసనలు, ఒక పక్క అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి, సొంత కూటమి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇందిరాగాంధీకి భారీ మెజారిటీ వస్తుందనే నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఎన్నికలకు వెళ్ళింది గాని దేశ వ్యాప్తంగా పెల్లు బికిన ప్రజాందోళన, చైతన్య వంతమైన ప్రజలు… కాంగ్రెస్‌ని చిత్తు చిత్తు గా ఓడించి తల్లి కొడుకును ఇంటి దారి పట్టించారు. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్‌ ప్రధాన మంత్రిగా… వాజ్‌పేయి, అద్వానీ, జార్జ్‌ ఫెర్నాండెజ్, మధు దండావతే లాంటి హేమాహేమీలు మంత్రులుగా జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పునాదులను కదిలించగలిగిన స్థాయిలో సత్యాగ్రహోద్యమం నడిపించన ఆనాటి నాయకుల స్ఫూర్తి నెట్‌వర్క్‌ ఎంత పటిష్టమైనదో మనకు తెలిసి వచ్చింది. ఆనాడు పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులకు, ఇంతమందిని కదిలించిన నాయకుల కార్యదక్షతకు జోహార్లు అర్పించాలి. ఎమర్జెన్సీ నేర్పిన గుణపాఠాలను రానున్న తరాలకు భద్రంగా అందించాలి. అయితే ఇందిరా గాంధీకి కొమ్ముకాసిన కమ్యూనిస్టులే నేడు బీజేపీ రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని గగ్గోలు పెడుతుండటం గమనార్హం.

దేశానికి రాజ్యాంగ స్పూర్తిని ప్రశ్నించిన నేటి చీకటి రోజును యువత తెలుసుకోవాలి. మన నాయకులు నిరంకుసత్వం మీద పోరాడి ప్రజాస్వామ్యన్నీ రక్షించుకున్న వైనం ప్రతి పౌరుడు గ్రహించాలి. మనం మన భవిష్యత్ తరాలకు అందిచవలసింది మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించిన స్వచ్ఛమైన స్వేచ్చ స్వాతoత్రాన్ని మాత్రమే. ఒక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగంలో ఎటువంటి లోపాలు లేకుండా అందించాం అందులో లోపాలు ఉంటే అది రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న పరిపాలకులదేనని ఎంతో గొప్పగా సెలవిచ్చారు.

డాక్టర్ జి. అజ్మతుల్లా ఖాన్
రాజకీయ విశ్లేషకులు