నేను అమాయకుడ్ని కాదు… జగన్‌కు అంతా చెప్పేస్తా…
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే… ఆ విషయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొందరు అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని… అలాంటి వారి వల్ల పార్టీకి నష్టమన్నారు. నియోజకవర్గంలో కొందరు అనవసర విషయాలు మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని… వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి తిరిగి పోటీ చేస్తానన్న ధర్మాన… అందరూ అనుకున్నంత అమాయకుడు తాను కాదన్నారు. అమాయకుడినైతే నాలుగుసార్లు గెలిచేవాడిని కాదన్న ధర్మాన… అల్లు అర్జున్ సినిమా పుష్పలో యాక్షన్ సీన్‌తో రక్తికట్టించారు. తగ్గేదేలా అంటూ సినీ డైలాగ్ అనుకరించారు.