Home Page SliderTelangana

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు చేపట్టిన నిరుద్యోగులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున నిలబడి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.