NewsTelangana

వంద కోట్లకు గతి లేదు కానీ..వెయ్యి కోట్లిస్తారా?

Share with

పినపాక టీఆర్‌ఎస్ ఎమ్మేల్యే రేగా కాంతారావుకి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లోని రెడ్డిపాలెంలో ప్రజల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. ఆయన ఆ గ్రామంలో అడుగు పెట్టగానే అక్కడి ప్రజలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఇంటి ఇంటి సర్వేను సక్రమంగా జరపకుండా గ్రామపంచాయతీలో రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. అసలు ఈ ప్రభుత్వం దళితులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తమకు మంజూరు చేసిన రూ.100 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు కానీ..ఇప్పడు మాత్రం రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు.ఇలా ప్రజలను నమ్మించి మోసం చేయడం తెలంగాణ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు.