కుమార్తె మృతి తట్టుకోలేక తండ్రికి గుండెపోటు
కృష్ణాజిల్లా పెనమలూరులోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. ఆమె మృతికి అనారోగ్యమే కారణం అని కాలేజీ యాజమాన్యం చెప్తుండగా, వారి వేధింపుల వల్లే చనిపోయిందని తండ్రి ఆరోపించారు. తమ కూతురికి ఏ సమస్యా లేదని చెప్తున్నారు. ఆమె మరణ వార్తను తట్టుకోలేక తండ్రికి గుండెపోటు వచ్చిందని సమాచారం.

