ఎన్డీఏపై విమర్శలు గుప్పించిన ఉద్ధవ్ థాక్రే
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏలో మొత్తం 36 పార్టీలు ఉంటే..వాటిలో ఈడీ,సీబీఐ,ఐటీ శాఖలే బలమైనవి అన్నారు. మిగతా పార్టీలు ఉన్నా ఒకటే..లేకపోయినా ఒకటే అని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కొన్ని పార్టీల్లో కనీసం ఎంపీలు కూడా లేరని ఉద్ధవ్ థాక్రే అన్నారు. అయితే బీజేపీ ముందుగా దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవధపై నిషేదం విధించాలని ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు.

