జపాన్‌ను వణికిస్తున్న హినమ్నర్ తుఫాన్
భారీ వర్షాలు, తుఫాన్లు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా, పాకిస్థాన్‌ను వణికించిన వరదలు ఇప్పుడు జపాన్‌ను చుట్టు ముట్టాయి. తూర్పు చైనా సముద్ర తీరంలో ఏర్పడిన ‘హినమ్నర్’ తుఫాను తైవాన్, చైనా, జపాన్ తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. గంటకు 216-296 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో పాటు భారీ వర్షాలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది ఇదే అత్యంత బలమైన పెను తుఫాన్ అని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్‌లో ఇటీవల సృష్టించిన వరద బీభత్సానికి 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ గ్రామం వరదల సమయంలో మతసామరస్యానికి వేదిక అయింది. ఆ గ్రామంలోని బాబా మధోదాస్ అనే హిందూ దేవాలయంలో 200-300 మంది ముస్లింలు ఆశ్రయం పొంది ప్రాణాలు దక్కించుకున్నారు.

