ఇద్దరు విద్యార్థినులు యాక్సిడెంట్‌లో మృతి
మంచిర్యాల జిల్లా జన్నారంలో రోడ్డు యాక్సిడెంట్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి.
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారంలో రోడ్డు యాక్సిడెంట్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పున్‌కల్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన కుంపర్ల రాహిత్య (15), వరాల సాత్విక (19) సోమవారం రాత్రి అక్కడ స్థానికంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాహిత్య తండ్రి గంగన్నతో కలిసి టూ వీలర్‌పై వారిరువురూ ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో పాతపున్‌కల్ వద్ద గుర్తు తెలియని వాహనం.. వీరు ప్రయాణిస్తున్న టూ వీలర్‌ను ఢీకొట్టింది. గంగన్న స్వల్పంగా గాయపడగా.. విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం రాహిత్య, సాత్వికలు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. రాహిత్య పదోతరగతి చదువుతుండగా.. సాత్విక నీట్ శిక్షణ తీసుకుంటోంది.

