NewsTelangana

టీఆర్ఎస్ సర్కారు అప్పుల తిప్పలు

Share with

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ దాదాపు 8 ఏళ్ళు అవుతోంది. అదే విధంగా కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిరోహించి కూడా 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ళల్లో కేసిఆర్ ప్రభుత్వం 4 లక్షల కోట్లకు పైగానే అప్పులు చేసింది. ఈసారి ఆ అప్పులకు బ్రేక్ పడింది. దీనికి సీఎం కేసీఆర్ కేంద్రానికి విరోధంగా మాట్లడడం ఒక కారణం అయితే, తెచ్చిన అప్పులు తీర్చకపోవడం మరొక కారణంగా చెప్పొచ్చు. తెలంగాణా ప్రభుత్వానికి ప్రతి నెల వివిధ శాఖల నుండి వచ్చే ఆదాయం దాదాపు 12-14 వేల కోట్లు మాత్రమే. అయితే ప్రతి నెల చెల్లించాల్సిన బకాయిలు, కిస్తీలు 17 వేల కోట్లుగా ఉన్నాయి. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ఆర్బీఐ నుంచి 3 వేల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది.
రైతుబంధు ,పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేసే సమయంలో ఈ అప్పుల భారం ఇంకా ఎక్కువ అవుతోంది. అయితే ఈ మధ్యకాలంలో ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్రం తో చర్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేంద్రం జూన్ లో అన్ని రాష్ట్రాలకు అప్పులు మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా… కేంద్రం నుంచి సహకారం లభించకున్నా… ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటోంది.