Andhra PradeshNews

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూత

Share with

సినీ పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్రవేసుకున్నారు గౌతమ్‌రాజు. చట్టానికి కళ్లు లేవు చిత్రం నుంచి సినీ ప్రస్థానాన్ని మెుదలు పెట్టారు. దాదాపు ‌800 పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేసారు. తెలుగు సినిమాలతో పాటు హింది,తమిళ్, కన్నడ సినిమాల్లోను తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్‌టిఆర్ నటించిన ఆది సినిమాకు ప్రముఖ ఎడిటర్‌గా నంది అవార్డు తీసుకున్నారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ చేసిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఖైదీ నెం 150, రేసుగుర్రం, ఉసరవెళ్లి, అదుర్స, రచ్చ, గోపాల గోపాల, బద్రినాథ్ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసారు. గౌతమ్ రాజు ఎడిటర్ గా ఉన్నారంటే… సినిమా హిట్టవుతుందని దర్శకులు ఫిక్స్ అయ్యేవారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… మంగళవారం మధ్యాహ్నం డిస్‌చార్జ్ అయ్యారు. కానీ హఠాత్తుగా నిన్న రాత్రి 1:30 నిలకు తన ఇంటిలోనే కన్నుమూసారు. గౌతమ్ రాజు మరణవార్త విని సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మంచు లక్ష్మీ, నరేష్‌తోపాటు… పలువురు సంతాపం ప్రకటించారు.