పెగాసస్ స్పైవేర్‌తో చంద్రబాబు సర్కారు కుట్ర -భూమన
స్పైవేర్ ఉపయోగించి ఏపీలో 40 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం.. చంద్రబాబు సీఎంగా ఉన్నాప్పుడు చేశారంటూ ఆరోపించారు పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. టీడీపీ హయాంలో 2016-2019 మధ్య పెద్ద కుట్ర జరిగిందని, అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా లేనివారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ ఏజన్సీల ద్వారా ప్రయత్నించిందని ఆయన చెప్పారు. సేవామిత్ర అనే యాప్ ద్వారా డేటా దొంగిలించారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్పైవేర్ ను కొనుగోలు చేసారని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. హౌస్ కమిటీ హోం, ఐటీ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించినట్టు భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. అవసరమైతే మరి కొందరిని కమిటీ ముందుకు పిలిపిస్తామని చెప్పారు. వచ్చే శాసనసభ సమావేశాల లోపు నివేదికను అందజేస్తామన్నారు భూమన. వ్యక్తుల భద్రతకు భంగం కలిగించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.