Home Page SliderInternationalNews Alert

అమెరికాలో టోర్నడో తుపాను.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

అమెరికాలో టోర్నడో తుపాను అల్లకల్లోలం చేసింది లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కుదిపేసింది. ఈ తుపాను కారణంగా ఇళ్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ తుపాను వల్ల ఎలాంటి ప్రాణ హనీ జరగలేదు. సుడిగాలి కారణంగా దాదాపు 25 మొబైల్‌ హోమ్‌ యూనిట్లు దెబ్బతిన్నట్లు ఎన్‌డబ్ల్యూఎస్‌ తెలిపింది. ఈ సుడిగాలి గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు అంచనా వేసింది.