Home Page SliderTelangana

అగ్రనేత నరేంద్రమోడీ వస్తున్నారు..!

ఎన్నికలు గురువారం కావడంతో ప్రధాన పార్టీ బీజేపీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేతలు బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, వీధి సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బీజేపీ అగ్రనేత మోడీ వస్తున్నారు. వీరి రాక నేపథ్యంలో భారీ జనసమీకరణ చేసి సత్తా చాటేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాళ్లపూసపల్లి, కేసముద్రం రోడ్ లోని లోటస్ మైదానంలో మ.12.45 గంటలకు నిర్వహించనున్న సకల జనుల విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు. స్థానిక బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్ తరఫున ప్రచారం చేయన్నారు. ప్రధాని కమలం పువ్వు గుర్తుపై (బీజేపీకి) ఓటు వేసి రాష్ట్రాభివృద్ధికై పాటుపడాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.