NewsNews AlertTelangana

హైదరాబాద్ మెట్రో మనుగడ సాధ్యమేనా?

Share with

మెట్రో లాభాల్లోకి ఎప్పుడొస్తాయి అన్న ప్రశ్నకు మేము కనీస గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నాము అని సమాధానమిస్తున్నారు హైదరాబాద్ లోని మెట్రో నిర్వాహకులు.అయితే మెట్రో లాభాల్లోకి రావాలంటే..అసలు లాభనష్టాలు లేని దశకు చేరుకోవాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసుకోవాలని అంచనా వేయగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఆరేడేళ్ళు పడుతుందని తెలిసింది.అయితే హైదరాబాద్ మెట్రోతో సహా దక్షిణాదిలోని అన్నీ మెట్రోల్లో  ఈ అంచనాలు విఫలమయ్యాయి అని చెప్పవచ్చు.మెట్రో ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో మెట్రోలు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి.దీంతో మెట్రో నిర్వహణ,నిర్మాణ పనులకు తీసుకున్న రుణంపై కనీసం వడ్డీ కూడా కట్టలేక మెట్రో యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పడుతుంది.

అయితే హైదరాబాద్‌లో మెట్రో లాభాల్లోకి రావాలంటే ప్రతిరోజు 19లక్షల మేర ప్రయాణికులు ఉండాలి.కరోనాకు ముందు 2019-20లో మెట్రో ప్రయాణికుల సంఖ్య 2.76 లక్షలకు చేరుకుంది.ప్రయాణికులు పెరిగుతున్నారన్న దశలో కరోనా విజృంభన కారణంగా ఢీలా పడిపోయింది.2021-22 సగటు 65 వేలకు పడిపోయింది.ఇటీవల మరల ప్రయాణికులు పెరిగినా..మెట్రో ఛార్జీ రేట్లు పెరిగితే తప్ప ఈ ఆర్దిక కష్టాలు తొలిగేలా లేవు.అయితే మెట్రోకు ఆశించిన విధంగా ప్రయాణికులు లేకపోవటానికి ప్రధాన కారణం ప్రణాళిక రహిత డీపీఆర్‌లు అని ఇటీవల దిల్లీలో మెట్రోరైళ్ళపై  జరిగిన సమావేశంలో స్టాడింగ్ కమిటీ అభిప్రాయపడింది.దీంతో పాటు సమీపంలోని మెట్రో స్టేషన్లకు చేరుకునే ప్రయాణ ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం ప్రధాన లోపంగా కమిటీ గుర్తించింది.అయితే ఈ లోపాలను  సవరించి త్వరలో మెట్రోను లాభాల బాటలో నడిపించాలని నిర్వాహకులు ఈ మేరకు తక్షణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.