ఉత్తి మాటలు కట్టిపెట్టండి..రేవంత్ రెడ్డి
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… బీజేపీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం బాగానే ఉందని… కానీ ప్రాజెక్టులు అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా యాదాద్రి వచ్చిన కేంద్ర జలవనురల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైందని అందరికీ తెలుసని… మరి కేంద్రం ఏం చేస్తోందని దుయ్యబట్టారు.
షెకావత్ జీ, సీఎం కేసీఆర్ కు ఎటీఎంలా కాళేశ్వరం మారింది నిజమని… కమీషన్ల కోసమే దానిని కట్టడం కూడా నిజమేనన్నారు రేవంత్ రెడ్డి. డిజైన్ లోపంతోనే కాళేశ్వరం మునిగిందని , కేసీఆర్ దోపిడి- అవినీతి పై మీరు చర్యలు తీసుకోరు ఇదైతే నికార్సైన నిజమని రాసుకొచ్చారు. ఉత్తి మాటలు కట్టిపెట్టి..గట్టి చర్యలు తలపెట్టండి అంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు షేర్ చేశారు రేవంత్. కాళేశ్వరంపై ఇప్పటి వరకు విమర్శలు చేయడం బాగానే ఉన్నా.. చర్యలు ఎందుకు తీసుకోరంటూ ఆయన బీజేపీని ప్రశ్నించారు.