NewsTelangana

ఈటలపై దుష్ప్రచారానికి కేసీఆర్ కుట్రలు

Share with

లేనిది ఉన్నట్టు… ఉన్నది లేనట్టు చెప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలను ఏమార్చడం… ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదని చాన్నాళ్లుగా ఉద్యమకారులు కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. ఉద్యమ ముసుగులో కేసీఆర్ చేసిన అకృత్యాల గురించి తెలంగాణ ప్రజలకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్… ఉద్యమకారులు మొదట్నుంచి వివరిస్తూనే ఉన్నారు. కేసీఆర్ ద్రోహ చరిత్ర ఆరంభం నుంచి చెప్పాలంటే మహాభారతం అంత అవుతుంది. రాయాలంటే రామాయణం అంత అవుతుంది. నాడు నరేంద్ర దగ్గర్నుంచి నేడు రాజేందర్ వరకు బీసీ బిడ్డలను కేసీఆర్ చేసిన దగా రాజకీయం జీవితాలను ఆగం చేసింది. తన కుట్రలను ఎవరూ గ్రహించలేరని… తాను అనుకున్నదే జరుగుతుందని… తన పథకాలే పారతాయని మొదట్నుంచి ఓ దిక్కుమాలిన ఫిలాసఫీ ఆధారంగా రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. కానీ కేసీఆర్ కుట్రలను తట్టుకొని… నిఖార్సయిన… వ్యక్తిత్వంతో నిలబడే వాళ్లూ ఉంటారని… ఈటలను చూశాకే కేసీఆర్‌కు అర్థమవుతోంది. టీఆర్ఎస్ పార్టీకి బతికేందుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజేందర్‌ను ఛిదిమేసేందుకు దొర ఆడుతున్న నాటకాలకు అంతే లేకుండా పోతోంది. పార్టీకి బతుకునిచ్చిన ఈటలను బయటకు వెళ్లిపోయేలా చేయడమే కాకుండా… నేటికీ విషం చిందిస్తూనే ఉన్నాడు దొర.

రెవిన్యూ అధికారుల సర్వే ప్రకారం 85 ఎకరాలను 65 ఎసైనీలకు ఇచ్చేశామంటూ కొత్త డ్రామాకు తెరదీస్తోంది కేసీఆర్ సర్కారు. జమునా హ్యాచరీస్ ఆధీనంలో ఉన్నా భూములను రైతులకు ఇచ్చేశారట. అసైన్డ్ ల్యాండ్స్ గురించి చెప్పాల్సిందంతా ఇప్పటికే రాజేందర్, జమునా ఇద్దరూ మీడియా ముఖంగా చెప్పారు. అక్కడ స్థానికులు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ ప్రమాణపూర్వకంగా చెప్పారు. ఆయన సతీమణి సైతం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఇప్పుడు చెబుతున్న అసైన్డ్ ల్యాండ్స్ గురించి… నాడు ఆయన ఏం చెప్పారో మీడియా పెద్దలకు తెలుసు. అందుకే ఇప్పుడు చేస్తున్న అరాచకాలకు మీడియానే అస్త్రంగా వాడుకోవాలని పన్నాగం పన్నుతున్నారు… చేయండి చేయండి.. ఎంతకు తెగిస్తారో చేయండి… కత్తిని పట్టుకున్నోడు కత్తికి ఎలా బలౌతాడో… విష ప్రచారం చేసేవాడు కూడా అదే విష ప్రచారానికి అంతమవుతాడు.

రాజేందర్ పై ఎందుకంత కసి కేసీఆర్ మీకు… రాజేందర్ నిజాయితీని నమ్ముకున్నోడు… నిబద్ధతను ఆయుధంగా చేసుకున్నోడు… వ్యక్తిత్వాన్ని అమ్ముకోని ధైర్యవంతుడు. అలాంటి వ్యక్తిపై ఇంతటి కక్షా… ఏం జేస్తావో ఎంత జేస్తావో చేసుకో దొర. బడుగులంటే అంత అలుసా నీకు… బీసీలను ఏం చేసినా మాట్లాడారనుకుంటున్నావా… నీకు సరైనోడు తొలిసారి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఒక ఎత్తు… ఇకపై ఇంకో ఎత్తు… నువ్వు చేసిన అకృత్యాలను, అరాచకాలను ప్రశ్నించే ఒకే ఒక్కడు రాజేందర్ చేసే సింహనాధం మీ చెవుల్లో రక్తం కారేల చేస్తుంది తస్మాత్ జాగ్రత్త. మంది మాగధలతో ఈటలపై దాడి చేయిస్తావా… కోట్లు కుమ్మరించి మీడియాలో కథనాలు ప్రసారం చేయిస్తావా… నువ్వెన్ని పన్నాగాలు పన్నినా ధర్మం ముందు అధర్మం ఓడుతూనే ఉంది. అది మహాభారతం. రామాయణమే కాదు… నేడు తెలంగాణలోనూ జరగుతుంది. దళిత బిడ్డకు సీఎం పదవి ఇస్తానన్నావు… ఇచ్చిన మంత్రి పదవి ఊడబీకావు… నీకు అవసరం వచ్చినప్పుడు పైసలివ్వాలి… నువ్వు వద్దనుకున్నప్పుడు సైడ్ అయిపోవాలా… ఇదేం నీచబుద్ది కేసీఆర్… ఇలాంటి రాజకీయం ఎన్నాళ్లు చేస్తావ్… ఎన్నేళ్లు చేస్తావ్…

తెలంగాణ ఉద్యమకారులు నీ నైజం గురించి మాట్లాడిన మాటలన్నీ యూట్యూబ్‌లో క్లిక్ చేస్తే స్పష్టంగా కన్పిస్తాయ్. నీళ్లు, నిధులు, నియామకాలంటూ తెలంగాణ ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చి… ఇప్పుడు సిద్ధాంతాలను విభేదించిన వారిపై కక్ష సాధిస్తావా… దొర సాలూ… ఇక నీ ఆటలు… మీడియాకు కోట్లు కుమ్మరించుకోండి… ఎందరు ఎంత మసిపూసినా… నీ బతుకు గురించి తెలంగాణ మరచిపోదు. తెలంగాణ బిడ్డలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈటలకు కబ్జా రోగమంటూ సొంత మీడియాలో సొల్లు కథనాలు వండించావ్… నోటికి రాని మాటలతో మాట్లాడించావ్… ఈటలను దారిలోకి తెచ్చుకునేందుకు బెదిరింపులకు దిగావ్… న్యాయం మాట్లాడాల్సిన అధికారులతో అధర్మానికి ఒడిగట్టించావ్… ఇవి ఎంతో కాలం సాగవ్ దొర. ఈటలేమన్న పాత కాలమోడనుకుంటున్నావా కేసీఆర్… నువ్విచ్చింది తిరిగి ఇచ్చేస్తాడు… అంతే కాదు… వడ్డీకి వడ్డీ… చక్ర వడ్డీ కూడా తిరిగిచ్చేస్తాడు… నిజమైన తెలంగాణ బిడ్డ సత్తా చాటుతాడు. హుజూరాబాద్‌లో మొదలైన ప్రజా ఉద్యమంలో కొట్టుకుపోడానికి సిద్ధంగా ఉండు. మొన్న చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే… రేపు వచ్చే సునామీని తట్టుకోలేవు… దుకాణం మూసేయాల్సిందే…